HYDERABAD : ఓఆర్ఆర్ పై 8కార్లు ఢీ…!

-

హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట అవుటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఎనిమిది కార్ లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఓవర్ రింగ్ రోడ్డు పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ పై ఉన్న ఓ పెట్రోల్ బంకు దగ్గర లారీ ఆకస్మాత్తుగా అడ్డురావడంతో వేగంగా వెళుతున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న మరి కొన్ని కార్లు ముందుకు వెళుతున్న కారును ఢీ కొన్నాయి.

అయితే ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ వాహనాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా ఒకదానినొకటి ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అంతే కాకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించిన వారిపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version