మెక్సికోలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 49 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. వలసదారులను ట్రక్కులో ఎక్కించి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాణాలతో బయటపడిన వారి ప్రకారం మృతుల్లో ఎక్కువ మంది గ్వాటెమాల నుంచి మెక్సికోకు వచ్చినట్లు తెలుస్తోంది. చియాపా డి కోర్జో నగరాన్ని రాష్ట్ర రాజధాని టక్స్‌ట్లా గుటిరెజ్‌తో కలిపే హైవేపై వాహనాన్ని అత్యంత వేగంగా నడపడంతో నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటన జరిగి ప్రదేశంలో భీతావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. సహాయ చర్యల కోసం అంబులెన్స్ లు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఘటనపై గగ్వాటెమాలన్ ప్రెసిడెంట్ అలెజాండ్రో గియామ్మాట్టీ ట్విట్టర్‌లో.. తన దేశస్థులలో ఎవరికైనా ఇంటికి తిరిగి రావడానికి సహాయం అందిస్తానని ప్రకటించాడు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. సాధారణంగా గ్వాటేమాలా నుంచి మెక్సికో వైపు వలసలు కొనసాగుతాయి. ట్రక్కుల ద్వారా బోర్డర్లను క్రాస్ చేస్తుంటారు ప్రజలు. వీరు ఉత్తరంగా ప్రయాణించి యూఎస్ చేరేందుకు ప్రయత్నిస్తుంటారు.