టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా మూవీ రాబిన్ హుడ్. ఈ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. మూత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నెని, రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చినటు వంటి గ్లింప్స్, టీజర్ ఆక్టుకున్నాయి.
అయితే.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చేసిన రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇటీవలే ప్రకటించారు. కానీ ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ ఉన్న తరుణంలో…. రాబిన్ హుడ్ చిత్ర బృందం వెనక్కి తగ్గింది. డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాకుండా వెనక్కి వెళ్లింది రాబిన్ హుడ్. ఈ మేరకు పోస్ట్ పెట్టింది రాబిన్ హుడ్ యూనిట్. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చేసిన రాబిన్ హుడ్ చిత్రం ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉందట.