శంషాబాద్​ బ్రాండ్​ అంబాసిడర్ గా జబర్దస్త్ ​ఫేమ్ !

శంషాబాద్ మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్ గా జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ ను ఎంపికయ్యారు. ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ – 2022 సంవత్సర కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా జబర్దస్త్ రాకింగ్ రాకేష్ హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడి టీచర్లకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ, నర్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్ తోకల విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సాబీర్ అలీ, కౌన్సిలర్లు భారతమ్మ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే శంషాబాద్ మున్సిపల్ బ్రాండ్ అంబాసిడర్ గా జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ను ఎంపిక చేశారు. కాగా… సినిమా నటుడిగా అలాగే కమెడియన్ గా జబర్దస్త్ లో రాకేష్… చాలా అద్భుతంగా నటిస్తున్నాడు. ఎలాంటి వివాదాలకు పోకుండా తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు రాకేష్.