షాకింగ్ : ఏప్రిల్ నాటికి 75 వేలు దాటనున్న ఒమిక్రాన్ మరణాలు !

దక్షిణాఫ్రికా దేశంలో పురుడుపోసుకున్న… ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి దేశాలకు పాకింది అని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ మన ఇండియాలోనూ ప్రవేశించింది. ఇప్పటికే మన దేశంలో 40 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇలాంటి తరుణంలో లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్ తో పాటు దక్షిణాఫ్రికాలోని స్టలెన్ బోస్ యూనివర్సిటీ పరిశోధకులు.. ఈ ఒమైక్రాన్ వేరియంట్ పై షాకింగ్ నిజాలు బయటపెట్టారు.

బ్రిటన్ దేశం లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. అలాగే ఇప్పుడే అదనపు రక్షణ చర్యలు తీసుకోకపోతే బ్రిటన్ లో భారీ ప్రాణ నష్టం తప్పదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 25 వేల నుంచి 75 వేల మరణాలు ఒక్క బ్రిటన్ లోనే సంభవించే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 60 శాతానికి పెరుగుతుందని హెచ్చరించారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. కాగా లండన్ లో ఈ కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 600కు పైగా ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.