20 కిలోలు తగ్గి, ఫిట్ గా మారిన రోహిత్ శర్మ

-

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రోహిత్ శర్మ తనదైన ఆటతీరుతో టీమిండియాలో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించాడు. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎంతో స్లిమ్ గా, ఫిట్ గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. కెప్టెన్ గా వరుస సిరీస్ లు ఆడినప్పటి కన్నా ఇప్పుడు రోహిత్ శర్మ ఎంతో ఫిట్ గా ఉన్నట్లు చూస్తేనే అర్థమవుతోంది.

Rohit Sharma
Rohit Sharma

బెంగళూరులో జరిగిన యోయో, బ్రాంకో టెస్టులో రోహిత్ పాస్ అయిన విషయం తెలిసిందే. అభిషేక్ నాయక్ ట్రైనింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జిమ్ లో సాధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ భారీ మొత్తంలో బరువు తగ్గారు. ఏకంగా 20 కిలోల బరువు తగ్గి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చారు. కేవలం 22 రోజుల్లోనే 20 కిలోల బరువు తగ్గడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రోహిత్ శర్మ ఇప్పుడు ఎంతో ఫిట్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news