సకల విజ్ఞాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే గణపతి 32 రూపాయలలో ప్రధానమైనవి 16 అందులో సిద్ధి గణపతి రూపం అత్యంత విశిష్టమైనది. ఈ రూపం భక్తులను అడుగడుగున విజయాన్ని శుభాలను చేకూరుస్తుంది. పేరులోనే సిద్ధి అంటే విజయం ప్రావీణ్యం అని అర్థం. ఈ రూపంలో గణపతి నాలుగు చేతుల్లో మామిడిపండు, చెరుకు గడ, గొడ్డలి,పాయసం గిన్నె,ధరించి ఉంటాడు. వీటిలో మామిడిపండు జ్ఞానాన్ని చెరుకుగడ జీవితంలోని మధురానుభూతులను గొడ్డలి కష్టాలను నశింప చేసే శక్తిని, పాయసం ఆధ్యాత్మిక ఆనందాన్ని సూచిస్తాయి. సిద్ధి గణపతి పూజించడం వల్ల భౌతికమైన విజయాలు మాత్రమే కాక ఆధ్యాత్మిక సాధనలో కూడా పురోగతి లభిస్తుంది. జీవితంలో ఏ కార్యాలైనా నిర్విఘ్నంగా సాగాలని కోరుకునేవారు సిద్ధి గణపతిని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
సిద్ధి గణపతిని నిష్టగా పూజిస్తే కార్యసిద్ధి లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయాలు లభిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, విద్య ఇలా ఏ రంగంలోనైనా పురోగతి సాధించవచ్చు. ఈయన ఆరాధన వల్ల మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి సత్యమైన జ్ఞానాన్ని అందిస్తాడు. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవడానికి సిద్ధి గణపతి పూజ ఎంతగానో సహాయపడుతుంది.

సిద్ధి గణపతిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థిక సుస్థిరత ఏర్పడుతుంది. సంపద వృద్ధి చెందుతుంది జీవితంలో సుస్థిరమైన సంపదకు మార్గాలు ఏర్పడతాయి. కేవలం భౌతికమైన విషయాలే కాక ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారు కూడా ఈ రూపం అండగా ఉంటుంది. మనసులో శాంతి ప్రశాంతత లభిస్తాయి.
సిద్ధి గణపతి ఆరాధన అన్ని రకాల విజయాలకు శుభాలకు మార్గం సుగమనం చేస్తుంది. ఈ వినాయకుని నిష్టతో పూజించిన వారికి కార్యసిద్ధి, జ్ఞానం, ఆర్థిక సుస్థిరత, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయి. జీవితంలో కష్టాలను తొలగించి సంతోషాన్ని ప్రసాదించే శక్తి సిద్ధి గణపతికి ఉంది. అందుకే ఏ పని ప్రారంభించిన ఏ కష్టం ఎదురైనా సిద్ధి గణపతిని స్మరించడం శ్రేయస్కరం అని పురాణాలు చెబుతున్నాయి.
గమనిక: భక్తి, నమ్మకం వ్యక్తిగతమైనవి. పైన పేర్కొన్న వివరాలు శాస్త్రాలు పురాణాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వ్యక్తిగత విశ్వాసాల ప్రకారం ఫలితాలు మారవచ్చు.