ఓపెనింగ్ బెర్త్ వదులుకున్న రోహిత్ శర్మ.. ఎందుకంటే?

-

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేక పోవడంతో జస్ప్రత్ బుమ్రా సారథ్యంలో తొలి టెస్టులో విజయం నమోదు చేసింది. ప్రజెంట్ రోహిత్ శర్మ జట్టుతో కలిశారు. రెండో టెస్టుకు హిట్ మ్యాన్ అందుబాటులో ఉండనున్నాడు.

ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పీఎం లెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానాన్ని వదులుకున్నాడు. టీం షీట్‌లో రోహిత్ పేరును ఐదో స్థానంలో చేర్చారు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, జైస్వాల్ పేర్లు ఉన్నాయి. రోహిత్ ఒక్క మ్యాచుకే ఓపెనింగ్ బెర్త్‌ను వదుకుంటారా? లేక సిరీస్ మొత్తం అలాగే కొనసాగుతారా? అనేది సస్పెన్స్‌గా మారింది. తొలి టెస్టులో ఓపెనర్లు రాహుల్, జైస్వాల్ అద్భుతంగా రాణించడంతో రోహిత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news