బ్యాటింగ్ వైఫల్యం.. ఓటమికి అదే కారణం : రోహిత్

-

ఆస్ట్రేలియాతో 3వ టెస్టు ఓటమిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వాక్యాలు చేశారు. ‘తొలి ఇన్నింగ్స్ లో మా బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్స్ చేయడం ఎంత ముఖ్యమో బాగా అర్థమయింది. ఆసీస్ కు ఆదిక్యం లభించిన కూడా రెండో ఇన్నింగ్స్ లోను విఫలమయ్యాం. తొలి ఇన్నింగ్స్ బాగా ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మనం సరిగ్గా ఆడితే పిచ్ తో సంబంధం లేకుండా ఫలితాలు అవే వస్తాయి’ అని మాట్లాడారు.

కాగా, ఆసీస్‌ పై మూడో టెస్ట్‌ మ్యాచ్‌ లో టీమిండియా ఓడింది. మొదటి రోజు నుంచి… ఆధిపత్యం చేలాయించిన ఆసీస్‌.. అవలీలగా టీమిండియాపై గెలిచింది. టీమిండియాపై ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది ఆసీస్.ఒకసారి రెండు జట్ల స్కోర్లు పరిశీలిస్తే, భారత్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ 109, సెకండ్‌ ఇన్సింగ్స్‌ 163 పరుగులు చేసింది. అటు ఆసీస్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ 197, సెకండ్‌ ఇన్నింగ్స్‌ 78/1 వికెట్‌ కోల్పోయి…విజయం సాధించింది. దీంతో 4 టెస్ట్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది భారత్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version