ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి నేతల మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల నేతలతో బూతులతో రెచ్చిపోతున్నారు. తాజాగా టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు…సిఎం జగన్, హోమ్ మంత్రి సుచరితని పరుష పదజాలంతో దూషించారు. ఇక అయ్యన్న వ్యాఖ్యలకు వైసీపీ నేతల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. ఎమ్మెల్యే జోగి రమేష్ ఇప్పటికే అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు ఇంటి దగ్గర ఫుల్ హడావిడి చేశారు.
ఇంకా అయ్యన్నకు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి, చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి పీకేశారన్నారు. అడ్డదారిన మంత్రి అయ్యిన లోకేశ్ పదవి పీకేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను పీకేశారని…ఇంకా ఏం పీకాలని అని రోజా ఫైర్ అయ్యారు. ఇక అయ్యన్నకు కౌంటర్లు ఇవ్వడంలో రోజా అదిరిపోయే లాజిక్‌లతో అదరగొట్టారని వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి.
జగన్ దెబ్బకు టిడిపి పునాదులు పీకేసే సమయం ఆసన్నమైందని, ఏళ్ల తరబడి టిడిపి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో…టిడిపి జెండా పీకేశారని…ఇలా చూసుకుంటే అన్నిరకాలుగా టిడిపికి జగన్ చుక్కలు చూపించారని అంటున్నారు. ఇప్పటికీ జగన్ దెబ్బకు టిడిపి కోలుకోలేకపోతుందని, భవిష్యత్‌లో కోలుకుంటుందనే నమ్మకం కూడా లేదని చెబుతున్నారు. ఏదేమైనా జగన్….టిడిపికి అన్నిరకాలుగా దెబ్బవేశారు.