2019 నుండి ఎక్కడా గెలవకపోవడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారని…శవాల నోట్లో తులసి తీర్థం పోసిన విధంగా టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్ తో గెలవలేదు.. అయినా పెద్ద ఘనకార్యం సాధించినట్లు సంబరాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదని విమర్శలు చేశారు. కానీ వాళ్ల అహంకారం కళ్లు నెత్తికెక్కి అసెంబ్లీలో స్పీకర్ ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరమని… బీసీ కులానికి చెందిన స్పీకర్ ను అవమానించి దాడికి యత్నించడం ఎంత వరకు సబబు? అని పేర్కొన్నారు.
చేసిన తప్పును సమర్థించుకోవడానికి మా నాయకులపై నిందలు వేయడం సిగ్గు చేటు అని ఫైర్ అయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల జాతి వాళ్లకు పదవులు ఇస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులను ముందు పెట్టి అన్యాయం చేస్తున్నామని చెప్పడం దురదృష్టకరమన్నారు. జీఓ నెం.1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చారా? చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీఓ నెం.1 తీసుకొచ్చామని చెప్పారు. జీఓ నెం.1 ప్రజలకు రక్షణ కల్పించడానికే… జీఓ నెం.1 రద్దు అంటే ప్రజలను చంపడానికి అవకాశమివ్వడమే అన్నారు రోజా.