ROMANTIC : గత్తరలేపుతున్న ‘రొమాంటిక్’ ట్రైలర్

-

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు…. పూరి ఆకాష్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రొమాంటిక్. ఈ రొమాంటిక్ సినిమాలు పూరి ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ పాడుడి దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమా పూరి కాన్సెప్టు పతాకంపై పూరి జగన్నాథ్ మరియు హీరోయిన్ ఛార్మి నిర్మిస్తున్నారు. ఖైదీ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర వహిస్తుండగా సునీల్ కాశ్యప్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు మరియు టీజర్ లు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. తాజాగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం ఈ చిత్ర బృందానికి స్పెషల్ విషెస్ చెప్పారు ప్రభాస్. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే… టైటిల్ కు తగ్గట్టుగానే రొమాంటిక్ సన్నివేశాలతో యూత్ ను మెప్పించే లా ఉంది. హీరో ఆకాశ్ మరియు కేతిక శర్మ చాలా బ్రహ్మాండంగా నటించారు. లవ్ మరియు క్రైమ్ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కినట్లు మనకు కనిపిస్తుంది. కాగా ఈ సినిమా అక్టోబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news