టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ టాలెంట్ ని టీమిండియా మాజీ బౌలర్ ఆర్పి సింగ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. క్రికెట్ డాట్ కాం అనే వెబ్సైట్ తో మాట్లాడిన సింగ్ ఒక కీలక విషయం చెప్పాడు. 2007 టీ 20 ప్రపంచ కప్ సమయంలో ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ బ్యాట్స్మెన్ కమ్రాన్ అక్మల్ బ్యాటింగ్ చేస్తూ ఉండగా పాదాలు కదలకుండా బ్యాటింగ్ చేస్తాడని, కాబట్టి ఖచ్చితంగా లైన్ అండ్ లెంగ్త్ మీద దృష్టి పెడితే అవుట్ చేయడం పెద్ద కష్టం కాదని ధోని నాతో చెప్పినట్టు ఆర్మీ సింగ్ గుర్తుచేసుకున్నాడు.
ఖచ్చితంగా అదేవిధంగా ఆక్మల్ అవుట్ అయ్యాడని ఆర్పి సింగ్ చెప్పుకొచ్చాడు. నేను వేరే ఫీల్డింగ్ లో మోడల్ ధోనీ దృష్టికి తీసుకుని వెళ్ళిన సరే ధోనీ మాత్రం అంగీకరించలేదని, ఇలా చేస్తే అవుట్ చేయడం చాలా ఈజీ అని తనతో చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు. ధోని చెప్పిన విధంగానే తాను బౌలింగ్ చేశానని ఆ మ్యాచ్లో ఆక్మల్ తక్కువ పరుగులకే అవుట్ అయినట్టు వెల్లడించాడు. 2007 ప్రపంచ కప్ టోర్నీలో 12 వికెట్లు తీసి టాప్ లీడింగ్ వికెట్ టేకర్ గా సింగ్ నిలిచిన సంగతి విదితమే.