ఆర్ ఆర్ ఆర్: అజయ్ దేవగణ్ వచ్చేసాడు..

-

ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి వరుస అప్డేట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ టీజర్లని రిలీజ్ చేసిన చిత్రబృందం, మొన్నటికి మొన్న అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ పోస్టర్ ని వదిలారు. ఆకాశానికి విల్లు ఎక్కు పెట్టిన అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ నుండి అజయ్ దేవగణ్ మోషన్ పోస్టర్ బయటకి వచ్చింది. ఈ మోషన్ పోస్టర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

పదుల కొద్ది దుండగులు అజయ్ దేవగణ్ ని చుట్టు ముట్టగా, వాళ్ళ చేతుల్లోని తుపాకులు అజయ్ దేవగణ్ కి గురి పెడుతూ మెల్ల మెల్లగా దగ్గరకి వస్తుండగా, కాల్చండంటూ తనపై ఉన్న వస్త్రాన్ని దించేసి గుండె ఎదురుచూపిన అజయ్ దేవగణ్ కనిపించాడు. ఆ కళ్ళలో ఎదుటి వారికి ధైర్యం చూస్తుంటే అజయ్ దేవగణ్ పాత్ర ఎంత ఎమోషనల్ గా ఉంటుందో అర్థం అవుతుంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో రూపొందుతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news