అంతుచిక్కని బ్రెయిన్ డిసీజ్.. 43 మందికి సోకగా.. 5 మంది మృతి..!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి ముప్పు అలానే ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడంతో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. ఇలాంటి తరుణంలో మరో అంతుచిక్కని వ్యాధి ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి కెనడాలో ఐదుగురు ప్రాణాలు విడిచారు. మరో 43 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ వ్యాధి ఎంతో ప్రమాదకరమైందని, మెదడుకు సంక్రమించే అరుదైన వ్యాధిగా పరిగణించారు. దీనిని ‘క్రీట్జ్‌ఫెల్డ్ జాకోబ్ డిసీజ్ (సీజేడీ)గా గుర్తించారు. ఈ ఏడాది ఈ వ్యాధికి సంబంధించి ఆరు కొత్త కేసులు నమోదు అయ్యాయి.

బ్రెయిన్ డిసీజ్
బ్రెయిన్ డిసీజ్

సీజేడీ బారిన పడిన వ్యక్తి తన జ్ఞాపకాలను కొద్ది కొద్దిగా మందగిస్తుంది. మెల్లమెల్లగా మెదడు కండరాలు చిట్లిపోతాయి. కెనాడాలోని న్యూ బెర్న్‌స్వక్ ప్రావిన్స్‌లోని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ సీజేడీ వ్యాధి లక్షణాలపై పరిశోధనలు నిర్వహించమని వైద్యులను కోరింది. ఈ మేరకు పరిశోధనలు నిర్వహించిన కెనడియన్ వైద్య నిపుణులు ఈ వ్యాధి గురించి అంతుచిక్కని రహస్యాలను తెలుసుకున్నారు. ఈ వ్యాధి వల్ల 2015లో 43 కేసులు నమోదు అయ్యాయి. 2020లో 24 కేసులు, 2021లో 6 కేసులు నమోదు కావడంతోపాటు ఐదుగురు ప్రాణాలు విడిచారు. అంతుచిక్కని ఈ మెదడు వ్యాధి గురించి తెలిసి వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

ఈ వ్యాధి ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే విషయంపై పరిశోధకులకు ఇంకా స్పష్టత రాలేదు. కానీ, న్యూబెర్న్‌స్వక్ ప్రావిన్స్ ఈశాన్య దిశలోని అకాడియన్ ఖండంలో వెలుగులోకి వచ్చినట్లు కొందరు పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాధి పర్యావరణానికి సంబంధించినదిగా వారు తెలిపారు. ఈ వ్యాధిని ‘మ్యాడ్ కౌ డిసీజ్’ అని చెప్పుకొచ్చారు. ఈ న్యూరోలాజికల్ వ్యాధి అసాధారణమైన ప్రోటీన్ కారణంగా పశువులకు వ్యాపిస్తుందని, జంతువుల్లో మెదడు, వెన్నుముక నరాలను క్షీణింపజేస్తుందని వైద్యులు తెలిపారు. జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించిందని వారు గుర్తించారు. దీనికి సంబంధించిన మొదటి కేసు యూకేలో 1986లో గుర్తించబడింది.

వ్యాధి లక్షణాలు..
సీజేడీ బారిన పడిన వారికి ఈ లక్షణాలు వస్తాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, దృష్టిలోపం ప్రధానంగా ఏర్పడుతుందని వైద్యులు నివేదించారు. అయితే ఈ వ్యాధి లక్షణాలపై ఇంకా స్పష్టత లేదని న్యూరాలజిస్ట్ డాక్టర్ అలైర్ మర్రెనో తెలిపారు. ఇది ప్రయాన్ వ్యాధి (అసాధారణమైన ప్రోటీన్ వ్యాధి) అని నిరూపించడానికి సరైన ఆధారాలు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, తిమ్మిరి, మనిషి ప్రవర్తనలో మార్పులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. 18 నుంచి 36 నెలల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని, దీని వల్ల మెదడు దెబ్బతినడం, కండరాలు పనిచేయకపోవడం, దంత సమస్యలు తలెత్తుతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news