“ఆర్ఆర్ఆర్” నుండి బిగ్ అప్డేట్ వ‌చ్చేసింది..!

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ ఈసినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ఆలియాభ‌ట్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటించింది. అంతే కాకుండా ఈసినిమాలో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్ గ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా రేంజ్ లో విడుద‌ల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తయ్యింది.

rrr glimpse videoఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన ప‌లువీడియోలు అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజా ఈ సినిమా నుండి మ‌రో గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ వీడియోలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారమారాజు పాత్ర‌లో అల‌రించగా…ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ఇక ఈ గ్లింప్స్ చూసిన త‌ర‌వాత ఆర్ఆర్ఆర్ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది. మ‌రి సినిమా ఏ రేంజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version