ఎలక్ట్రిక్ వాహనాలకు టాక్స్ ఫ్రీ ప్రకటించిన మరో రాష్ట్రం

-

పెట్రోల్ ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. మరోవైపు వాహనాల నుంచి వెలువడుతున్న కర్బణ ఉద్గారాల వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. దీంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల ( EV) వైపు మొగ్గు చూపుతున్నారు. రానున్న భవిష్యత్ అంతా EV లదే కావడంతో పలు రాష్ట్రాలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి. ట్యాక్స్ కు మినహాయింపులను ఇస్తున్నాయి. ప్రస్తుతం FAME II అనే కేంద్ర ప్రభుత్వ ఈ-వెహికల్ పాలసీ కాకుండా ఢిల్లీ, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ‘ఈ-వెహికల్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. తాజాగా ఒడిశా కూడా EV వాహనాలకు టాక్స్ ఫ్రీని ప్రకటించింది. 2025 వరకు ఈ EV వాహనాలకు పూర్తిగా రిజిస్ట్రేషన్ ఫీని మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులు, తయారీదారులు, బ్యాటరీలు మరియు ఛార్జింగ్ స్టేషన్‌లకు అనేక ప్రోత్సాహకాలను పొడిగించాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 

ప్రస్తుతం వినియోగదారులు EV వైపు మొగ్గు చూపుతున్నా.. భారత దేశంలో ఇంకా అందుకు సరైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహించాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version