మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ సినిమా కోసం మెగా అభిమానులు, నందమూరి అభిమానులు, రాజమౌళి అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ముగియడంతో మార్చి 25వ తేదిన విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ తో పాటు నాటు నాటు పాటతో పాటు పలు అప్ డేట్స్ ఇచ్చారు.
దీంతో ఈ సినిమాపై.. అంచనాలు దారుణంగా పెరిగిపోయాయి. తాజా గా ఈ సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ సాంగ్ అంతామ్ అనే పేరు తో ఒక పాట ప్రోమోను ను విడుదల చేశారు. ఎత్తర జెండా అంటూ రామ్ చరణ, తారక్.. అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఓరిమితే కొట్టరా కొండా.. అంటూ సాగే ఈ పాట ప్రోమోలో రామ్ చరణ, తారర్ అభిమానుల్లో అంచనాలను ఇంకా పెంచుతున్నారు.
Here's #RRRCelebrationAnthem Promo..🕺💃🕺⚡️⚡️
Full song on March 14th, 4 pm!
An @mmkeeravaani Musical!#RRRonMarch25th #RRRMovie #EttharaJenda #Sholay #Koelae #EtthuvaJenda #EtthukaJenda
— RRR Movie (@RRRMovie) March 12, 2022