తెలంగాణకు రూ.38,114 కోట్ల ‘ముద్ర’ రుణాలు మంజూరు

-

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణకు రూ. 38,114 కోట్ల ‘ముద్ర’ రుణాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు 47.26 లక్షల ఖాతాల్లోకి నిధులు జమనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

పార్లమెంట్
పార్లమెంట్

కరీంనగర్ ఎంపీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి సమాధానం చెప్పారు. తెలంగాణ విషయానికొస్తే… “ప్రధాన మంత్రి ముద్ర యోజన” ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు గత ఆరేళ్లలో మొత్తం 47,26,819 మంది ఖాతాలకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

వీటిలో 37,46,740 మంది రూ. 50 వేలలోపు (శిశు పథకం) రుణాలు ఇస్తున్నామని.. అలాగే రూ.5 లక్షల లోపు (కిషోర్ పథకం) రుణాలు , 7,94,193 మంది, రూ.10 లక్షలలోపు (తరుణ్ పథకం) రుణాలు తీసుకున్న వారి సంఖ్య 1,85, 886 మంది ఉన్నట్లు వివరించారు కేంద్ర మంత్రి.

Read more RELATED
Recommended to you

Latest news