పోరస్‌ కంపెనీ బాధితులకు రూ.50 ఆర్థిక సాయం – హోం మంత్రి వనిత

-

విజయవాడ : గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రికి హోం మంత్రి తానేటి వనిత వచ్చారు. ఏలూరు పోరస్‌ కంపెనీలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు హోం మంత్రి వనిత. అనంతరం.. మినిష్టర్ తానేటి వనిత మాట్లాడుతూ… నూజివీడు ఘటటనలో స్పాట్ లో ఐదుగురు చనిపోయారని తెలిపారు. మృతులకు ఇప్పటికే నష్టపరిహారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

ఏపీ ప్రభుత్వం నుండి 25 లక్షలు, ఫ్యాక్టరీ నుండి 25 లక్షలు మొత్తం 50 లక్షలు మృతుల కుటుంబాలకు పారితోషికం ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఫ్యాక్టరీపై 3 గంటల్లో రిపోర్ట్ తీసుకుని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు హోం మంత్రి తానేటి వనిత. కాగా.. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో ఇవాళ రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఆదేశాలతో… పొరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ మూతపడింది.

Read more RELATED
Recommended to you

Latest news