దర్శనం వెంకటయ్య అరెస్టుపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నిన్న సైబర్ క్రైమ్ పోలీసులు సీఎం రేవంత్ గారిని దూషించారని నెల్లికుదురులో దర్శనం వెంకటయ్య అనే 77 సం ఎస్సీ(మాల) సామాజిక వర్గానికి చెందిన పేద రైతును అన్నం తింటూ ఉంటే బలవంతంగా గుంజుకొని పోయి, అరెస్టు చేసి, మధ్య రాత్రి బెయిలు మీద విడుదల చేసి ఇంట్లో పడేసి పోయారు. @TelanganaCMO గారు, ఒక్క సారి ఆయన ఇల్లు చూడండి.
ఎంత దయనీయ మైన పరిస్థితుల్లో బతుకుతున్నారో! వాళ్లు చాలా మంది (ఎస్సీ, ఎస్టీ, బీసీలు )తరతరాలుగా ఇలాగే బతుకుతున్నారు. మీ వర్గాలకు చెందిన వారు ఈ విధంగా బతుకుతున్నారా?
పేదల భాషలో మనకు అభ్యంతరకరమనిపించే పదాలు దొర్లడానికి మూలాలు : శతాబ్దాల పేదరికం, నిస్సహాయత, నిరాశ, నిరక్షరాస్యత, దోపిడీ, కోపం..మరెన్నో.. ముందు వీటిని నిర్మూలించడానికి కృషి చేయండి.
@revanth_anumula గారు, ఈ వెంకటయ్య లేదా మరెవరైనా మీ మీద,మీ కుటుంబ సభ్యుల మీద వాడిన ఘాటు భాషను మేం సమర్థించం కానీ, మీరు కూడా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యుల మీద హోదాను మరచి విచ్చలవిడిగా వాడుతున్న వికృత భాషను వెంటనే బంద్ చేయండి.అక్కడి నుండే సమస్యంతా మొదలైతున్నది.మీ హాయాంలో తెలంగాణ తెలుగు కలుషితమైతున్నదని గుర్తించండి’ అని రాసుకొచ్చారు.
నిన్న సైబర్ క్ర్రైం పోలీసులు సీయం రేవంత్ రెడ్డి గారిని దూషించారని నెల్లికుదురులో దర్శనం వెంకటయ్య అనే 77 సం ఎస్సీ(మాల) సామాజిక వర్గానికి చెందిన పేద రైతును అన్నం తింటూ ఉంటే బలవంతంగా గుంజుకొని పోయి, అరెస్టు చేసి, మధ్య రాత్రి బెయిలు మీద విడుదల చేసి ఇంట్లో పడేసి పోయారు.… pic.twitter.com/C03iDf82pF
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 20, 2025