ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగుడి దగ్గరికే వెళ్లి, కింద కూర్చుని..ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నాదెండ్ల మంచి మనసు చాటుకున్నారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు మంత్రి నాదెండ్ల మనోహర్.

నిలబడే అవకాశం లేక కింద కూర్చుని ఉన్న దివ్యాంగుడిని గుర్తించి.. స్వయంగా వెళ్లి సమస్య తెలుసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నాదెండ్ల. తన పేరు షేక్ అబ్దుల్ అని, తెనాలి పట్టణం పినపాడు సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీగా పని చేస్తున్నానని, విధుల్లో భాగంగా పన్నుల వసూలు వంటి వాటికి బయటకు వెళ్లాల్సి వస్తుందని మొర పెట్టుకున్నాడు దివ్యాంగుడు. తక్షణమే అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్.