నేను చూడని ఉద్యమాలా…? కెసిఆర్ చెప్పింది ఇదే…!

-

తెలంగాణ ఉద్యమం తరహాలో జరుగుతుంది సమ్మె” ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ వాదులు చేసిన వ్యాఖ్య ఇది…! బస్సు దిగిన కార్మికులు పెద్ద ఎత్తున తమ సమ్మెను దిగ్విజయంగా కొనసాగించారు. దాదాపు 50 రోజుల పాటు సమ్మె చేయడం అంటే మాటలు కాదు… దానికి తోడు రెండు నెలల జీతాలు కూడా వదులుకుని… ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా వెనక్కు తగ్గకుండా, రెండు సార్లు విధుల్లో చేరమని కెసిఆర్ చెప్పినా సరే అందుకు గడువు విధించినా వాళ్ళు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు సమ్మెను విరమిస్తాం ఉద్యోగాల్లోకి తీసుకుంటే అని…

జేఎసీ చైర్మన్ అశ్వత్దామ రెడ్డి ప్రకటన చేసారు. కానీ సమ్మె కాలంలో ఎక్కడా కూడా కెసిఆర్ వెనక్కు తగ్గలేదు… వాళ్లతో రాజీకి వచ్చే ప్రయత్నమూ చేయలేదు… ఎంపీ కేశవరావు… కెసిఆర్ అంగీకరిస్తే తాను మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పినా ఆ తర్వాత ఆయన కనపడలేదు… తాత్కాలిక ఉద్యోగులను పెట్టి బస్సులు నడిపారు గాని వారిని చర్చలకు పిలవలేదు… ఈ సమయంలో వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం కెసిఆర్ కు మరింత బలాన్ని ఇచ్చింది. అప్పటి వరకు ఆచితూచి వ్యవహరించిన ఆయన ఆ రోజు ఏకంగా మీడియా సమావేశం పెట్టి,

“లంగా పంచాయితీలు చేస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు” అని బహిరంగంగా అన్నారు. ఇక విపక్షాలు జోక్యం చేసుకున్నాయి, మద్దతు ఇచ్చాయి, గవర్నర్ గారు జోక్యం చేసుకున్నారు, కేంద్రానికి ఫిర్యాదు చేసారు, అయినా గాని కెసిఆర్ మాత్రం వెనక్కు తగ్గలేదు. చివరకు వాళ్ళే సమ్మె విరమించారు. ఇప్పుడు విపక్షాలకు కెసిఆర్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు… తనను తక్కువ అంచనా వేయడం మంచిది కాదని, తనను ఇరుకున పెట్టాలి అనుకోవడం అంత సులభం కాదని, ఇలాంటి వాటిని తాను చాలా చూసాను అని ఉద్యమ అనుభవాన్ని పరోక్షంగా చెప్పారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో భారీ మెజారిటీ ద్వారా…

ప్రజల్లో ఆర్టీసీకి మద్దతు లేదనే విషయాన్ని ఆయన గ్రహించారు కాబట్టే అలా మాట్లాడారు అని కొందరు అంటూ ఉంటారు. తాను స్పందించకపోతే వాళ్ళే వెనక్కు తగ్గుతారు అనుకున్నారో ఏమో గాని కెసిఆర్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు ఇది విపక్షాలకు ఒక హెచ్చరిక… ప్రధానంగా బలపడాలి అని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన వార్నింగ్. ఉద్యమాలు, నిరసనలు, సమ్మెలు ద్వారానే కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు… వాటికి ఆయన లొంగుతారు అనుకోవడం వాళ్ళ భ్రమ అనేది ఆర్టీసీ ఉద్యమంతో స్పష్టమైందనేది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడు కెసిఆర్ తో వాళ్ళు రాజీకి వచ్చి విధుల్లో చేరడం మినహా మరో మార్గం వాళ్లకు లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version