ప్రయాణికులకు ఆర్టీస గుడ్ న్యూస్ చెప్పింది. దసరాలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తీపి కబురును వెళ్లడించింది. దసరాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది. పండగ సందర్భంగా ఉండే ప్రయాణికుల రద్దీకీ అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడవనున్నాయి. ఈనెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ప్రతీ ఏడాది దసరా పండగ సమయంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి ఉంటాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు నానాయాతననుల ఎదర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందులు తప్పించేందుకు తెలంగాణ ఆర్టీసీ ఈనిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు ఈ బస్సులను ఆపరేట్ చేయనున్నారు. దాదాపుగా 4035 బస్సులను ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. 50 శాతం ఎక్స్ ట్రా ఛార్జీలను వసూలు చేయనుంది. ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి జిల్లాకు ఈ ప్రత్యేక బస్సులు నడపనుంది. మరోవైపు నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీ పండగ సీజన్నుక్యాష్ చేసుకునేందుకు చూస్తోంది. పండగతో అయినా లాభాల బాట పట్టలని భావిస్తోంది. ఈసారైనా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అనుకుంటుంది.
ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు ప్రత్యేక బస్సులు
-