ఈ దేశాల నుంచి వస్తే RTPCR టెస్ట్‌ కావాల్సిందే

-

కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. చైనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ దేశంతో పాటు పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ జాబితాలో చైనా, జపాన్, దక్షిణకొరియా, థాయ్ లాండ్, సింగపూర్ దేశాలు ఉన్నాయి.

వీరికి ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. థర్మల్ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా, జ్వరం ఉన్నా వారిని క్వారంటైన్ లో ఉంచుతారు. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వారి ఆరోగ్య పరిస్థితిని తెలయజేసేందుకు ఎయిర్ సువిధ ఫామ్ ను కచ్చితంగా నింపాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version