డబ్బు రెట్టింపు అయ్యేందుకు 72 నిబంధన..!

-

ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరూ కష్ట పడకుండా సులభంగా మనీ సంపాదించాలని భావిస్తుంటారు. వచ్చిన డబ్బులను పెట్టుబడి పెట్టి లాభాన్ని ఆర్జించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే ధ్యేయంగా పనిచేస్తుంటారు. జీవితంలో డబ్బుకు అంత ప్రాధాన్యం ఉంది కాబట్టి వీలైనంత తర్వగా చేతిలో డబ్బును రెట్టింపు చేసుకోవాలని యోచిస్తుంటారు. డబ్బులు పెట్టుబడి పెట్టడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్, బ్యాంకుల్లో డబ్బులను డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి స్కీం (ఎస్ఎస్ వై), ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్ డీ) ఇలా చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే లాభాన్ని ఈజీగా పొందవచ్చు.

cash
cash

ఈ స్కీం మీరు పెట్టుబడి పెట్టే డబ్బులపై మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. మీ డబ్బులు ఎంత త్వరగా రెట్టింపు అవుతాయనే అంశం కూడా మీరు డబ్బుల పెట్టే స్కీమ్‌పై వచ్చే వడ్డీ రేట్లపై ఆధారపడుతుంది. మీరు తక్కువ వడ్డీ వచ్చే స్కీంలో డబ్బులు పెడితే మీ డబ్బు రెట్టింపు కావడానికి ఎక్కువ కాలం పడుతుంది. అదే ఎక్కువ వడ్డీ వచ్చే స్కీంలో డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే డబ్బు త్వరగా రెట్టింపు అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఏ స్కీంలో డబ్బులు పెట్టుబడి పెట్టినా ఎంత కాలంలో డబ్బులు రెట్టింపు అవుతుంతో చిటికెలో చెప్పవచ్చు. దీనికి సంబంధించి కస్టమర్లు 72 నిబంధనను ఫాలో అవ్వాలి. కొంత మందికి ఈ రూల్స్ తెలిసే ఉంటాయి. తెలియని వారు మీ డబ్బులను వడ్డీ రేటుతో 72ను భాగిస్తే.. అప్పుడు మీ డబ్బు ఎన్ని రోజుల్లో రెట్టింపు అవుతోంది తెలుసుకోవచ్చని నిపుణులు తెలిపారు.

ఉదాహరణకు మీరు బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. వడ్డీ రేటు 5 శాతంగా ఉంది. ఇప్పుడు మీ డబ్బు 14 ఏళ్లలో రెట్టింపు అవుతుందని అనుకోండి. ఇక్కడ మీరు 72/5 వేస్తే 14.4 సంవత్సరాలు వస్తుంది. అంటే ఇన్ని సంత్సరాల తర్వాత మీ డబ్బు రెట్టింపు అవుతుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు కేవలం 3 సంవత్సరాల్లో డబ్బులు రెట్టింపు కావాలని భావిస్తే 21 నుంచి 24 శాతం రాబడి వచ్చే స్కీంలో డబ్బులు పెట్టుబడి పెట్టండని నిపుణులు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news