సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. గురువారం ఉదయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా అంటూ ట్వీట్ చేశారు.
‘ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ.. హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయిన వారికి పెన్షన్లకు పైసలు లెవా? అని ప్రశ్నించారు. అసమర్థుడి పాలనలో.. ఆర్థిక రంగం అల్లకల్లోలంగా మారిందని.. ప్రభుత్వాన్ని నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారంమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు.. రాష్ట్ర సంపద పెంచడమని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
పేమెంట్ కోటాలో పదవి దక్కడం తో కళ్లు నెత్తికెక్కాయని, పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశావని, తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నారని’ కేటీఆర్ ఫైర్ అయ్యారు.