ప్రపంచంలో అగ్ర దేశ ఎన్నికలపై ఇప్పుడు సందిగ్ధం నెలకొంది..డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిచనప్పటికి ఇప్పటి వరకూ కూడా అధికారులు ఫలితాన్ని ప్రకటించలేదు..తను భారీ మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించుకున్నారు బైడెన్..మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు..నేనే గెలిచానని ట్రంప్ పదేపదే ట్విట్ చేస్తున్నారు..కౌంటింగ్‌పై న్యాయస్థానం ఆశ్రయిస్తానని ట్రంప్ చెప్పటడంతో యూఎస్ ఫలితంపై సందిగ్ధం మొదలైంది..తాజాగా రష్యా, చైనా కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపును ఇంకా గుర్తించటం లేదు..ఎన్నికలపై న్యాయపరమైన సవాళ్లు తొలిగిపోయేంతవరకు బైడెన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలుపరని ఆ దేశ అధికార ప్రతినిధి తెలిపారు.
జో బైడెన్ ఎన్నికను గుర్తించని రష్యా,చైనా..కారణం ఇదే.
-