అత్యాచారాల విషయంలో ఇప్పుడు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సరే కామందుల కామానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రేప్ లు చేస్తున్నారు. ఉరి శిక్షలు వేసి కాల్చి చంపేస్తున్నా సరే మృగాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా జార్ఖండ్ లో ఘోర సంఘటన అక్కడ విషాదంగా మార్చింది. ఆ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గొడ్డా జిల్లాలో 13 ఏళ్ల అంగ వైకల్యం బాలికపై అత్యాచారం, హత్య జరిగినట్లు మహాగామా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, దీపికా పాండే సింగ్ సిఎం హేమత్ సోరెన్‌కు లేఖ రాశారు. మెహర్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిరోండి గ్రామంలోని పాఠశాల గదిలో మృతదేహం లభించిందని ఆయన సిఎంకి ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై సిఎం వేగంగా స్పందించి విచారణకు ఆదేశించారు.