ఉక్రెయిన్ లో జాతీయ ఎమర్జెన్సీ… ఉక్రెయిన్ – రష్యా ఉద్రిక్తతల మధ్య కీలక నిర్ణయం

-

ఉక్రెయిన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్ ల మధ్య గత కొన్ని వారాలను నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పకపోవచ్చని ప్రపంచ దేశాాలు భావిస్తున్నాయి. ఇప్పటికే లక్షకు పైగా రష్యా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులు.. ఉక్రెయిన్ సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. నిన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయి రష్యా- ఉక్రెయిన్ పరిణామాలపై చర్చించారు. 

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ తాజాగా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది. రష్యా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్ భద్రతా మండలి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఉక్రెయిన్ లోని డోనెట్స్క్ మరియు లుహాన్స్క్ ప్రాంతాలు కాకుండా.. మిగతా అన్ని ఉక్రేనియన్ భూభాగాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. అత్యవసర పరిస్థితి 30 రోజుల పాటు కొనసాగుతుందని మరియు మరో 30 రోజులు పొడిగించవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version