ఇండియన్ బాహుబలి ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న `సాహో` ని సాత్రంత్య దినోత్సవం సందర్భం గా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ బాగా ఆలస్యమైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ తేదీకి విడుదల చేయడం ఖాయమని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రిలీజ్ వాయిదా పడింది. అదే నెల 30కి వాయిదా వేస్తున్నట్లు నిన్నటి సాయంత్ర మే ప్రకటించారు. కారణం ఏంటన్నది వెల్లడించలేదు గానీ… పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం రీజన్ గా వినిపిస్తోంది. అయితే ఇక్కడే చాలా మందికి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి ఎప్పటికప్పుడు విఎఫ్ ఎక్స్ పనులు జరుగుతున్నాయి.
వాటిలో లోటు పాటులుంటే అప్పటికప్పుడే సరిచేసుకుంటూ వచ్చారు. షూటింగ్ విషయంలో ఆ పంథానే అనుసరించారు. చాలా సన్నివేశాలకు రీషూట్లు చేసుకుంటూ వచ్చారు. అంతా ఓ క్లారిటీకి వచ్చిన తర్వాత ఆగస్టు 15 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తేదీలో ఎట్టి పరిస్థితుల్లో మార్పు ఉండదని నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఒకటికి రెండు సార్లు నొక్కి వొక్కాణించారు. అప్పుడు అంత కాన్పిడెంట్ గా ఉన్నప్పు డు ఇప్పుడెం దుకు వెనక్కి తగ్గుతున్నారు? ముందు ప్లానింగ్ ప్రకారం రిలీజ్ కు సరిగ్గా నెల రోజులు సమయం ఉంది. ఇప్పుడు అదనంగా మరో 15 రోజులే సమయం తీసుకోవడంతోనే ఎక్కడో తేడా కొడుతుంది.
కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులేనా? లేక అంతకు మించి ఊహించని కారణాలు ఏవైనా ఉన్నాయా? అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే అంటే? కచ్చితంగా ఎక్కువ రోజులే సమయం పడుతుంది. అన్ని పనులు పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ లో ప్యాచ్ వర్క్ పూర్తి చేయడానికే ఎలా లేదన్నా నెల రోజులు సమయం పడుతుంది. అలాంటింది సాహో టీమ్ రిలీజ్ తేదీని ఆగస్టు 30 వరకూ తొసేసిందంటే? చెప్పలేని విషయాలు కూడా ఉండుంటాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ రూమర్లపై టీమ్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.