నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే శబరిమల అయ్యప్ప దర్శనం

-

శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుంది. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్టు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా వెంట తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు.

Sabarimala-Temple

రెండు నెలల దర్శనాల నిమిత్తం ఆలయం నవంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల కారణంగా దాదాపు 5 నెలలపాటు శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకోలేదు.ఈ మహమ్మారి వలన భక్తులు కి దేవునికి మధ్య దూరం పెరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇంతలా సంక్షోభం సృష్టించిన ఈ మహమ్మారి ఎప్పుడు అదుపులోకి వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ వాక్సిన్ తొందరగా అందుబాటులోకి వస్తే మానవ సమాజం మొత్తం కచ్చితంగా ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version