గూగుల్‌లో కొత్త ఫీచ‌ర్‌.. మీ వ‌‌ర్చువ‌ల్ విజిటింగ్ కార్డ్‌ను ఇలా క్రియేట్ చేసుకోండి..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త‌న యూజ‌ర్ల కోసం ఓ స‌రికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ సెర్చ్‌లో ప్ర‌స్తుతం యూజ‌ర్లు పీపుల్ కార్డ్స్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీని స‌హాయంతో యూజ‌ర్లు త‌మ వ‌ర్చువ‌ల్ విజిటింగ్ కార్డును క్రియేట్ చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో మీ గురించి ఇత‌రుల‌కు తెలుస్తుంది. మీరు వ్యాపార‌వేత్త అయితే మీ వ్యాపారం గురించి ఇత‌రుల‌కు తెల‌ప‌వ‌చ్చు. అదే ఫ్రీలాన్స‌ర్ అయితే మిమ్మ‌ల్ని ప‌నికోసం ఇత‌రులు సంప్ర‌దిస్తారు. ఇలా గూగుల్ వ‌ర్చువ‌ల్ విజిటింగ్ కార్డ్స్ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.

గూగుల్‌లో వ‌ర్చువ‌ల్ విజిటింగ్ కార్డ్‌ను క్రియేట్ చేయ‌డం ఇలా…

1. యూజ‌ర్లు ముందుగా త‌మ గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి.

2. సెర్చ్‌లో పేరు వెద‌కాలి. లేదా యాడ్ మి టు సెర్చ్ అనే ప్రాంప్ట్ రాగానే ట్యాప్ చేయాలి.

3. కార్డును క్రియేట్ చేసేందుకు గూగుల్ అకౌంట్‌లో ఉన్న పేరును ఎంపిక చేసుకోవ‌చ్చు. లేదా వేరే ఏదైనా పేరు యాడ్ చేయ‌వ‌చ్చు. అలాగే మీ గురించిన డిస్క్రిప్ష‌న్‌, వెబ్‌సైట్ లింకులు, సోష‌ల్ మీడియా ప్రొఫైల్స్‌, ఫోన్ నంబ‌ర్‌, మెయిల్ ఐడీ త‌దిత‌ర వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయ‌వ‌చ్చు.

4. అనంత‌రం ఏదైనా ఫోన్ నంబ‌ర్‌తో ఆథెంటికేష‌న్ ఇవ్వాలి. దీంతో వ‌ర్చువ‌ల్ విజిటింగ్ కార్డు క్రియేట్ అవుతుంది.

గూగుల్‌లో ఎవ‌రైనా ఎవ‌రి పేరునైనా వెదికినప్పుడు వాటిల్లో అలా క్రియేట్ చేసుకున్న వ‌ర్చువ‌ల్ విజిటింగ్ కార్డుల్లో ఉన్న పేర్లు క‌నిపిస్తాయి. ఒక‌టిక‌న్నా ఎక్కువ మందికి ఒకే పేరు ఉంటే వారి వివ‌రాల‌న్నీ సెర్చ్‌లో జాబితా రూపంలో కనిపిస్తాయి. దీంతో కావ‌ల్సిన వారిని ఎంచుకుని కాంటాక్ట్ చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల స్వ‌యం ఉపాధి పొందేవారు, వ్యాపార‌వేత్త‌లు, ఫ్రీలాన్స‌ర్స్‌, ఇత‌ర ఉద్యోగులు, ప్రొఫెష‌న‌ల్స్‌కు ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version