మకర జ్యోతికి సర్వం సిద్ధం…

-

మకరజ్యోతి అయ్యప్ప దర్శనాన్ని పురస్కరించుకుని శబరిమల ఆలయ ద్వారాలను ఆదివారం సాయంత్రం తెరిచారు.  ఆదివారం నుంచి 21రోజుల పాటు ఆలయ ద్వారాలను తెరిచి ఉంచుతారు. అయితే మండల దీక్ష నిమిత్తం 41రోజుల పురస్కరించుకుని డిసెంబరు 27 వరకూ ఆలయాన్ని తెరిచి ఉంచిన సంగతి తెలిసిందే. ట్రావెన కోర్ దేవస్థానం ఏటా మాదిరిగానే… మళ్లీ మకరవిళక్కు(సంక్రాంతి) సందర్భంగా సాయంత్రం 5గంటలకు ఆలయ ద్వారాల తెరవగానే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆలయ ప్రధాన తంత్రి వీఎన్‌ వాసుదేవన్‌ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచి, అయ్యప్పస్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇరుముడులు ధరించిన భక్తులను పవిత్ర పదునెట్టాంబడి మీదుగా ఆలయం లోపలికి అనుమతించారు. జనవరి 20న ఉదయం 7గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు.

శబరిమల కొండలన్నీ ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ శరణుఘోషతో ప్రతి ధ్వనించాయి. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా…అన్ని జాగ్రత్తలు చేపట్టినట్లు పత్తనంథిట్ట జిల్లా కలెక్టర్‌ పీబీ నూహ్‌ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news