హైకమాండ్ వార్నింగ్ బేఖాతరు.. అవినీతిపై సచిన్ పైలట్ పోరు

-

రాజస్థాన్​లో కాంగ్రెస్​ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం అశోక్‌ గహ్లోత్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. అధిష్ఠానం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సచిన్‌ పైలెట్‌ ఆందోళన బాట పట్టారు.

వసుంధర రాజే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ పైలట్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జైపుర్​లోని షహీన్‌ స్మారక్‌ వద్ద సచిన్‌ పైలట్‌ ఆందోళన ప్రారంభించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నిరాహార దీక్ష.. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. అంతకుముందు సంఘ సంస్కర్త జ్యోతిరావ్‌ ఫూలే జయంతిని పురస్కరించుకొని జైపుర్​లోని గోడౌన్‌ సర్కిల్‌ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు పైలట్​.

రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ సోమవారం స్పందించింది. పైలట్‌ దీక్ష పార్టీ వ్యతిరేక చర్య కిందకే వస్తుందని పేర్కొంది. బహిరంగంగా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా పార్టీలో చర్చిస్తే బాగుండేదని అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version