ఎక్కువగా మనకు తాబేళ్లు చెరువుల్లో, సరసుల్లో, ఆలయాల్లో కనపడుతుంటాయి. చాల మంది ఇళ్ళలో కూడా వీటిని పెంచుకుంటారు. అయితే ఇవన్నీ సాధారణ తాబేళ్లు. వీటి గురించి అందరికీ సుపరిచితమే కానీ నక్షత్ర తాబేళ్ల గురించి విని ఉండరు. ఇవి మనకి చాల అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వీటి గురించి మీరు చాల విషయాలు తెలుసుకోవాలి. మరి పూర్తిగా ఇప్పుడే తెలుసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళితే… అరుదుగా కనిపించే ఈ నక్షత్ర తాబేళ్ళని అదృష్టంగా భావిస్తారు. దేవాలయాలు, అడవుల్లోనూ ఉండాల్సిన ఈ తాబేళ్ళని ఇప్పుడు మన దేశం నుంచి విదేశాలకు పంపిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే..?
ఇతర దేశాల్లో వీటి ధర లక్షల రూపాయల దాక పలుకుతున్నాయి. అందుకే వీటిని అక్కడికి తరలిస్తున్నారు. కానీ వీటిని అక్రమ రవాణా చేస్తే 1972 వన్యప్రాణి సంరక్షణ విభాగం చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల జైలుశిక్ష అని చెబుతున్నారు అధికారులు. సెంటిమెంట్ల తో వీటిని బందీలని చెయ్యకుండా స్వేచ్ఛగా ఉంచడం ఎంతో ముఖ్యం.