అసెంబ్లీ ఎన్నికల ముంగిట.. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సందేశం పంపారు. ఢిల్లీ ఓటర్లను కొనుక్కోవచ్చని బీజేపీ వాళ్లు అనుకుంటున్నారని… కానీ.. మీరు ఏ ఒక్కరికీ అమ్ముడుపోరని వాళ్లకు నిరూపించండి అంటూ ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సందేశం పంపారు. డబ్బులు పంచే ఏ ఒక్క పార్టీకి కూడా ఓట్లు వేయొద్దని కోరారు.
చివరికి నా అభ్యర్థి డబ్బులిచ్చినా సరే.. అతనికి ఓటు వేయకండని వేడుకున్నారు. మేమిక్కడ చిల్లర రాజకీయాలు చేయడం కోసం రాలేదని తెలిపారు. మొత్తం వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి వచ్చామని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సందేశం పంపారు.