ఈ కామెడీ జీనియస్..ఆర్ట్ జీనియస్ కూడా..!

-

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న హాస్య నటుడు బ్రహ్మానందం తనకు ఉన్న పెయింటింగ్ కళతో వారేవా అనిపిస్తున్నారు. అప్పట్లో బ్రహ్మానందం వెంకటేశ్వర స్వామి పెయింటింగ్ లను వేసి మెగాస్టార్ చిరంజీవి హీరో రానా మరియు అల్లు అర్జున్ లకు ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా బ్రహ్మానందం షిరిడి సాయి పెయింటింగ్ వేశారు. అంతే కాకుండా దాన్ని సీనియర్ నటుడు కృష్ణంరాజు కు అందజేశారు. కృష్ణంరాజు తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ కామెడీ జీనియస్ ఆర్ట్ జీనియస్ కూడా అంటూ కృష్ణంరాజు బ్రహ్మానందం పై ప్రశంసలు కురిపించారు. బ్రహ్మానందం కు అద్భుతమైన టాలెంట్ ఉంది.. ఈ స్వీట్ సప్రైజ్ ఇచ్చినందుకు థాంక్యూ అంటూ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇక కృష్ణంరాజు కు బ్రహ్మానందం ఇచ్చిన సాయిబాబా ఫోటో పెయింటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే నటనకు దూరంగా ఉన్న బ్రహ్మానందం ఖాళీ సమయాల్లో పెయింటింగ్ వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news