పోప్ ప్రాన్సిస్ ఇండియా సందర్శించాలంటూ ప్రధాని మోడీ ఆహ్వానం

-

ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వాటికన్ సిటీలో ఘన స్వాగతం లభించింది. ఈ రోజు వాటికన్ నగరంలో పోప్ ప్రాన్సిస్ తో మోదీ భేటీ అయ్యారు. 2013 తర్వాత ప్రాన్సిస్ పోప్ అయిన తరువాత కలిసి మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ రికార్డులకు ఎక్కారు. ఈనేపథ్యంలోనే పోప్ ప్రాన్సిస్ భారత్ ను సందర్శించాలని మోదీ ఆహ్వనించారు. తాజా జీ -20 సమావేశం కోసం మోదీ ఇటలీ వెళ్లారు. రోమ్ లో జరిగే జీ-20 సమావేశానికి హాజరుకానున్నారు. జీ-20 సమావేశానికి ముందు పోప్ ప్రాన్సిస్ తో భేటీ అయ్యారు. మొదటగా 20 నిమిషాల భేటీ అనుకున్నప్పటికీ గంట దాకా సమావేశం సాగింది.  భేటీలో వాతావరణ మార్పలు, పేదరికం నిర్మూలన గురించి మోదీ, పోప్ చర్చించారని విదేశాంగ శాఖ తెలిపింది. 1999 లో అప్పటి పోప్ జాన్ పాల్2ను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కలిశారు. పోప్ ప్రాన్సిస్ తో భేటీ అనంతరం జీ-20 సమావేశాల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు ప్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మక్రాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడిడో, సింగపూర్ ప్రధానిలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news