తండ్రి శవం పక్కన సెక్సీఫోటో షూట్ చేసిన కూతురు..తిట్టిపోస్తున్న నెటిజన్లు

-

మనకు బాగా తెలిసినవాళ్లు చనిపోతేనే మనం బాధపడతాం..అలాంటిది కన్నతండ్రి చనిపోతే..ఆ బాధఎంత ఘోరంగా ఉంటుంది. సాధరణంగానే అమ్మాయిలకు తమ తండ్రిమీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. డాడ్స్ లిటిల్ ప్రిన్స్ కదా అందరూ. అలాంటిది ఓ కూతురు తన తండ్రి చనిపోతే బాధపడటం మాటదేవుడెరుగు..పబ్లిసిటీ ఈవెంట్ లా చేసింది . తండ్రిశవం పక్కన సెక్సీ ఫోజులతో ఫొటో షూట్ చేసింది. ఆమె చేసిన పనికి అందరు తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ సిటీకి చెందిన 20 ఏళ్ల జేన్ రివేరా ఓ సోషల్ మీడియా స్టార్.. అంతేకాదు ఓ ఫిట్ నెస్ మోడల్.. మోడలింగ్, ఫ్యాషన్ దుస్తులు, స్విమ్ సూట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. టిక్ టాక్ లో 3 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ లో 84 వేల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆమె తన లైఫ్ కి సంబంధించిన ప్రతిదీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన తండ్రి శవం పక్కన ఫొటో షూట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

జేన్ రివేరా తండ్రి ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న ఆయన మరణించారు. దీంతో ఆయనకు ఘనంగా అంత్యక్రియలు ఏర్పాటు చేశారు . కానీ తుది వీడ్కోలు సమయంలో జేన్ తన తండ్రి శవం పక్కన సెక్సీగా ఫొటో షూట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ #dadless అనే హ్యాష్ ట్యాగ్ తో రెస్ట్ ఇన్ పీస్ నాన్న, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని రాసింది.

కానీ జేన్ చేసిన పనిని మాత్రం నెటిజన్లు అంతా అసహ్యించుకుంటున్నారు. తండ్రి పక్కన ఫొటో షూట్ చేయడాన్ని ఆమె ఫాలోవర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు అసలు మనిషివేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెను తిట్టిపోస్తు లక్షల మంది కామెంట్లు చేశారు. దీంతో జేన్ రివేరా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. నాన్నంటే తనకు చాలా ఇష్టమని, మోడలింగ్ లో రాణించాలని దీవించేవారని, ఆయన లోటును ఫీలవ్వకుండా ఉండేందుకకు ఇలా ఫొటో షూట్ చేశానని జేన్ అంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news