ఆస్పత్రి నుంచి సాయి ధరంతేజ్ ట్వీట్.. త్వరలోనే కలుద్దాం !

మెగాస్టార్ మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్… వినాయక చవితి రోజున రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ పై బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సాయి ధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అవ్వడం వల్ల పడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్.. మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలోనే అందరి ముందుకు వస్తానంటూ ఆస్పత్రి నుంచే పేర్కొన్నాడు సాయి ధరమ్ తేజ్.

” నా పై మరియు నా సినిమా “రిపబ్లిక్” పై మీ ప్రేమ మరియు ఆప్యాయతకు నా కృతజ్ఞతలు. మీ ప్రేమకు థాంక్స్ చెప్పడం అంటే.. ఆ పదం చాలా చిన్నది అవుతుంది… త్వరలోనే కలుద్దాం” అంటూ ట్వీట్ చేశారు సాయి ధరమ్ తేజ్. అంతేకాదు.. తాను కోరుకుంటున్నట్లు అర్థం వచ్చేలా తంబు చూపిస్తూ ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. దీంతో ఆయన ఫ్యాన్స్.. ఉత్సాహంలో నిండి పోయారు. కాగా అక్టోబర్ ఒకటో తేదీన సాయిధరమ్ తేజ్ నటించిన.. రిపబ్లిక్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే.