మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్..!

మెగా హీరో సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. బైక్ స్కిడ్ అవ్వ‌డంతో ప్ర‌మాదానికి గురైన సాయి ధ‌ర‌మ్ తేజ్ కు కాల‌ర్ బోన్ స‌ర్జ‌రీ జ‌రిగింది. కాగా ఇంత కాలం సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌క‌పోవ‌డం…ఆరోగ్యం పై ఎలాంటి అప్డేట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. కాగా తాజాగా తేజ్ ఆరోగ్యం పై కుటుంబ సభ్యులు అప్డేట్ ఇచ్చారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ పూర్తిగా కోలుకున్నార‌ని కుటుంబ స‌భ్యులు స్పష్టం చేశారు. ప్ర‌స్తుతం ఇంటిదగ్గరే ఉంటూ ప్రత్యేక తేజ్ ప్ర‌త్యేక డైట్ తీసుకుంటున్నట్టు తెలిపారు.

అంతే కాకుండా ప్రస్తుతం ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ ట్రీట్ మెంట్స్ లో తేజ్ ఉన్నట్టు సమాచారం అందుతోంది. ముఖంపై తగిలిన గాయాలు ఇప్ప‌టికే తగ్గుముఖం ప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా త్వరలోనే కొత్త సినిమా షూటింగ్‌లో తేజ్ పాల్గొనబోతున్నట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇక తేజ్ ఆరోగ్యం పై అప్డేట్ రావ‌డంతో మెగా అభిమానులు కుషీ అవుతున్నారు. త‌మ అభిమాన హీరోను చూసేందుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.