చంద్రబాబుకు ఫోన్‌ చేసిన అమిత్‌ షా..

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. చంద్రబాబు తో కొద్ది సేపటి క్రితం ఫోన్ లో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమ్మూ కాశ్మీర్ నుంచి నిన్న రావడం ఆ తరువాత ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని చంద్రబాబుకు ఈ సందర్భంగా చెప్పారు అమిత్ షా. అయితే తాను హైదరాబాద్ వచ్చేశానని చంద్రబాబు చెప్పారు.

టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి, గంజాయి మాదకద్రవ్యాల అక్రమ రవాణా రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసం వంటి అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా చంద్రబాబు అమిత్ షాకు వివరించారు. టిడిపి నేతల పై కేసులు గృహాలపై దాడులు విధ్వంసాలు చర్యలు తీసుకోవాలని కోరారు చంద్రబాబు. కేంద్ర బలగాల తో రక్షణ కల్పించాలని కోరారు. అన్ని విషయాలను పరిశీలిస్తానని చెప్పారు హోం మంత్రి అమిత్ షా