టీ లేదా కాఫీ తాగాక వాటర్ తాగితే నిజంగానే పళ్లు ఊడిపోతాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

-

మనలో చాల మందికి బెడ్ కాఫీ అలవాటు ఉండే ఉంటుంది. అసలు ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే ఏ పని మొదలుపెట్టలేము. ఏంటో అలా కనెక్ట్ అయిపోయాం కదా. ఇంకా చల్లటి సాయంకాలం వేళ వేడివేడి అల్లం ఛాయ్ తాగుంతుంటే ఆహా ఏముంటదిలే.. మంచి రిలీఫ్ ఫీలింగ్. అయితే చాలమంది టీ లేదా కాఫీ తాగేముందు వాటర్ తాగుతారు.. కానీ కాఫీ తాగాక మాత్రం నీళ్లు తాగరు. ఒకవేళ మనం తాగిన చిన్నప్పటినుంచే మన పెద్దొళ్లు అరే అలా చేయకూడదు పళ్లు ఊడిపోతాయ్ అంటారు. ఇది ఎంతవరకూ నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.

tea

నిజానికి మనం టీ, కాఫీ వేడి వేడిగా తాగుతాం. ఆ తరువాత వెంటనే చల్లగా ఉండే నీళ్లు తాగడం వలన దంతాలు కదిలి.. ఊడిపోతాయని చెబుతుంటారు. అయితే.. నిపుణులు మాత్రం దీనిపై మీకు ఎలాంటి అపోహలు అవసరం లేదని చెబుతున్నారు. టీ లేదా కాఫీ తాగాక కొద్దీ సేపటికి మీరు నీరు తాగచ్చు.. లేదా నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించవచ్చు. ఇలా చేయడం వలన పళ్ళు గారపట్టవట. టీ, కాఫీలలో కెఫీన్ అనే పదార్ధం ఉంటుందనే విషయం మనకు తెలసిందే.

కెఫిన్ వల్ల పళ్లకు గార పడుతుంది. ఈ కెఫీన్ అనే పదార్ధం అల్జీమర్స్, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఈ పదార్ధం వల్లనే, మనం టీ, లేదా కాఫీ తాగగానే రిలీఫ్ అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ, ఎక్కువ మొత్తంలో టీ / కాఫీ లు తీసుకోవడం వలన, మన శరీరంలో కెఫీన్ ఎక్కువై కాలేయ సంబంధిత సమస్యలను తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే టీ, కాఫీలను పరిమితంగానే తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అలాగే, వేడి వేడిగా టీ, కాఫీ లు తాగడం వలన ఏరో డైజస్టివ్ సిస్టమ్‌ పై ఉండే పొర దెబ్బతింటుంది. అందుకే ముందుగా కొంత మంచినీటిని తాగడం వలన ఈ పొర వేడిని తట్టుకోగలుగుతుందట.

అంతేకాదు టీ / కాఫీలు అసిడిటీని కలిగిస్తాయి. కాలేయ సంబంధిత వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మీరు కాఫీ లేదా టీ తాగేముందు మంచినీటిని తాగితే.. ఈ సమస్యలు ఉండవు. అలాగే తాగిన తర్వాత కూడా నోట్లో నీళ్లు పోసి పుక్కిలించుకోవటం వల్ల పళ్లు కూడా గారపట్టకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news