సాయి పల్లవి కొత్త టాలెంట్.. ఫిదా అవుతున్న స్టార్ హీరోయిన్స్..?

-

అందాల ఆరబోతతో కాదు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఫిదా బ్యూటీ సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోడి కట్టిన సాయి పల్లవి… మొదటి సినిమాతోనే తెలంగాణ యాస తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ అమ్మడు.

ఇక ఇటీవల తన కొత్త సినిమాలో భాగంగా ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న షూటింగులో పాల్గొంది సాయి పల్లవి ఈ క్రమంలోనే ఖాళీ సమయంలో ఎంతో సరదా సరదాగా గడిపింది. అక్కడ ఉన్న చిన్నపిల్లలందరికి తన దగ్గరికి పిలుచుకు వారితో సరదాగా కబుర్లు చెప్పడం లాంటివి చేసింది సాయి పల్లవి. అంతటితో ఆగకుండా ఏకంగా చిన్నారుల చేతులను మెహేంది తో ఎంతో అందంగా రూపుదిద్దింది. రకరకాలైన డిజైన్ లు వేస్తూ చిన్నారుల చేతులను నింపేసింది సాయి పల్లవి. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news