పెన్సిల్ మొనపై దుర్గమ్మ రూపం.. చూస్తే ఆశ్చర్యపోతారు..!

-

రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ఈగా సినిమాలో సమంత మైక్రో ఆర్టిస్టుగా నటించి మైక్రో ఆర్టిస్టుల ప్రతిభ గురించి అందరికీ చాటి చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎంతోమంది మైక్రో ఆర్టిస్టులు తెర మీదికి వచ్చి వారి ప్రతిభ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇటీవలే ఓ మైక్రో ఆర్టిస్ట్ తనదైన శైలిలో అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఏకంగా అమ్మవారి రూపురేఖలను పెన్సిల్ మొనపై చిత్రీకరించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. 

ఇప్పటివరకు ఎన్నో రకాల కళాకృతులను రూపొందించినా వెంకటేష్ అనే మైక్రో ఆర్టిస్ట్ ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించుకున్నాడు. కేవలం చిన్న చిన్న వస్తువుల పై ఎంతో అద్భుతమైన రూపాలను ఆవిష్కరించడం వెంకటేష్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవలే ఏకంగా పెన్సిల్ మొనపై అమ్మవారి రూపును మైక్రో ఆర్టిస్ట్ వెంకటేష్ తీర్చిదిద్దడం.. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news