సాయి తేజ్ కెరోర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అదే.. అంతా దాని వల్లనే..

-

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో డిసెంబరు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాయి ధరమ్ తేజ్, ప్రమోషన్ పనుల్ని వేగవంతం చేసాడు. జీవితంలో పెళ్ళీ గిల్లీ వద్దని చెప్తూ దానికి గల కారణాలను శ్లోకాల రూపంలో చెబుతూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నాడు. ఈ పోస్టర్లు అందరినీ అకట్టుకుంటున్నాయి. ఈ ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు. ఒకరు తెలివైనవారు, రెండు పెళ్ళయిన వారు వంటి మాటలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఐతే కరోనా టైమ్ లో థియేటర్లలోకి సందడి తీసుకురావడానికి వస్తున్న ఈ సినిమా సాయి తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనుంది.

కరోనా టైం కాబట్టి థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. సోలో బ్రతుకే సినిమాతోనే చాలా థియేటర్లు తెరుచుకోనున్నాయి. అందువల్ల సాయి తేజ్ కెరీర్లో ఇదే పెద్ద రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అదీగాక ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ బాగానే వస్తున్నాయట. థియేటర్లలో సినిమా చూడక చాలా రోజులయ్యింది కాబట్టి చాలామంది అందుకోసం వేచి చూస్తున్నారు. సోలో బ్రతుకే సినిమా ట్రైలర్ క్రేజీగా ఉండడంతో ప్రేక్షకులు సినిమా చూడడానికి సిద్ధం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version