తేజ్ ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్..సర్జరీ సక్సెస్..!

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సాయి ధ‌ర‌మ్ తేజ్ కు అపోలో ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న సాయిధ‌ర‌మ్ తేజ్ కు అన్ని ర‌కాల ఆరోగ్య ప‌రీక్ష‌లు చేసిన అనంత‌రం వైద్యులు ఈ రోజు కాల‌ర్ బోన్ కు స‌ర్జ‌రీ చేశారు. కాల‌ర్ బోన్ ఫ్యాక్చ‌ర్ అవ్వ‌డంతో వైద్యులు స‌ర్జరీ చేశారు. ఇక స‌ర్జ‌రీ అనంత‌రం హెల్త్ బులిటెన్ ను విడుద‌ల చేశారు. హెల్త్ బులిటెన్ లో స‌ర్జ‌రీ విజ‌య‌వంతం అయిన‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు.

స‌ర్జ‌రీ అనంత‌రం 24గంట‌ల పాటు తేజ్ ను ఐసీయూ లో అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఇక స‌ర్జ‌రీ విజ‌య‌వంతం అవ్వ‌డంతో తేజ్ త్వ‌ర‌లోనే పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కానున్నారు. ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ మ‌రియు తేజ్ అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఇక తేజ్ అతివేగం, నిర్ల‌క్ష్యంగా బండి న‌డ‌ప‌టం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు వెల్లడించారు.