వెంకీ 75వ సినిమా ‘సైంధవ్’ .. రిలీజ్ డేట్ ఇదే!

-

ప్రస్తుతం శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ ‘సైంధవ్’ అనే ఒక యాక్షన్ మూవీ చేస్తున్నారు. క్రితం ఏడాది ‘ఎఫ్ 3’ సినిమాతో ఆడియన్స్ కి కితకితలు పెట్టేశారు. అలాగే ‘ఓరి దేవుడా’ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు వీడియో చూడగానే, యాక్షన్ ఒక రేంజ్ లోనే ఉంటుందనే విషయం అర్థమైపోయింది.

ఆ తరువాత నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఒక్కసారిగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు. భారీ పేలుడు పదార్థాలకు సంబంధించిన కంటైనర్ పై, తుపాకీ పట్టుకుని కూర్చున్న వెంకీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికీ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. .

Read more RELATED
Recommended to you

Exit mobile version