బ్రేకింగ్‌ : ఐసీయూలో సైరా బాను

దివంగత ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ భార్య సైరా బాను ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆసుపత్రిలో చేరడానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు. అమెకు హర్ట్‌ స్టోక్‌ వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యం లోనే ఈరోజు ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అటు సైరా బాను ఆరోగ్యం పట్ల… ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా… సైరా బాను భర్త, ప్రముఖ నటుడు దిలీప్ కుమార్‌ ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. 98 ఏళ్ల వయస్సు ఉన్న నటుడు దిలీప్ కుమార్‌…. ఆరోగ్య సమస్య ల కారణంగా ఈ ఏడాది జూలై 7 న కన్నుమూశారు. ఇక తాజాగా దిలీప్ కుమార్ భార్య సైరా బాను కూడా ఆనారోగ్య తో ఆస్పత్రిలో చేరడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.